- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మణుగూరు పట్టణం బంద్
by Jakkula.Mamatha |
మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు పట్టణం బంద్ నిర్వహించారు.

X
దిశ, మణుగూరు: మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు పట్టణం బంద్ నిర్వహించారు. సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా పీకే ఓసి డిప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి అప్పగించాలని, పీకే ఓసి విస్తరణ ఎక్స్ టెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కు మణుగూరు చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రైవేటు విద్యాసంస్థలు మొత్తం సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. మణుగూరు పట్టణ బంద్ తో పట్టణంలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Next Story






