- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ లవర్స్‌కు పండగే.. ఈ వారం తెలుగులో నాలుగు వెబ్ సిరీస్‌లు
సూపర్ సుబ్బు, ఇసుకపట్నం, గుర్తుకొస్తున్నాయి, వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్‌లు ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు నాలుగు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. అవి ఏవి? ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం.
సూపర్ సుబ్బు
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ జూలై 2, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'టిల్లు స్క్వేర్' ఫేమ్ మల్లిక్ రామ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా, రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా నిర్మించారు.
ఇసుకపట్నం
సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మైమ్ గోపి, రోహిణి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.
గుర్తుకొస్తున్నాయి
విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
వీరభద్రుని రహస్యం
భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అన్నీ, రఘు కుంచె, అభినవ్ కమల్, తుము అనూరాధ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.






