హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: రామగుండం ఎమ్మెల్యే

by Jakkula.Mamatha |

హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.

హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: రామగుండం ఎమ్మెల్యే
X

దిశ, గోదావరిఖని: హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోంగార్డుల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. హోంగార్డులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఎమ్మెల్యేకు వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సేవలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హోంగార్డుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం, గోదావరిఖని హోంగార్డులు పాల్గొన్నారు.

Next Story