రవితేజ, శ్రీవిష్ణు కాంబోలో మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్.. పోస్ట్‌తో భారీ హైప్!

by Mallepaka Hamsa |

ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ వంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు టాక్.

రవితేజ, శ్రీవిష్ణు కాంబోలో మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్.. పోస్ట్‌తో భారీ హైప్!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా కొనసాగుతోంది. స్టార్ హీరోలు బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తే ఆ హంగామానే వేరు. ఇప్పుడు అలాంటి ఒక అదిరిపోయే కాంబినేషన్ సెట్ అయినట్లు టాక్. మాస్ మహారాజా రవితేజ, విలక్షణ నటుడు శ్రీవిష్ణు కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారని పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒకరిది ఊరమాస్ ఎనర్జీ అయితే, మరొకరిది డిఫరెంట్ టైమింగ్ అండ్ యాక్టింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ వంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు టాక్.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారట. దిల్ రాజు నిర్మాణంలో వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే మంచి బజ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథను పక్కాగా సిద్ధం చేసి, త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి కూడా తీసుకెళ్లడానికి దర్శకుడు హసిత్ గోలి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సారి సంక్రాంతికి రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఇద్దరు ఎనర్జిటిక్ హీరోల మల్టీస్టారర్ మూవీ రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది.

Next Story