- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య సేవలకు 'నో డిస్టెన్స్'
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులతో ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపడుతోంది.

దిశ, మంచిర్యాల : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులతో ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపడుతోంది. అంతేకాకుండా వైద్యులను భర్తీ చేసి పలు రకాల వైద్య సేవలను అందిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. కొందరు ఆసుపత్రి అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏరియా ఆసుపత్రిలో ఈ దుస్థితి తలెత్తింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది. ప్రతిరోజూ ఆసుపత్రికి 500 నుంచి 600 వరకు ఓపీ నమోదవుతోంది.
ఆయా చికిత్సల కోసం వచ్చిన ప్రజలకు ఆసుపత్రిలోని ఓపీ హాలులో ఐదుగురు డాక్టర్లు కలిసి పక్కపక్కనే ఒకేచోట వైద్య సేవలు అందిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారింది. ఆసుపత్రిలో వైద్యులకు కేటాయించిన ఓపీ గదులు ఉన్నప్పటికీ, వైద్యులందరూ ఒకేచోట ఉండడంతో రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఎవరి మాట వినాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మహిళలు, పురుషులు సామానుల కోసం కిరాణా దుకాణం వద్ద బారులు తీరినట్లు కనిపిస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిన వైద్యులే 'గుంపులో గోవింద' అన్న మాదిరిగా వైద్య సేవలు సాగించడం ఆసుపత్రిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పలురకాల చికిత్సలకు ప్రత్యేక ఓపీ గదులు ఉండగా, అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి వైద్య సేవలు అందించడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






