గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Batti.Sumithra |

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, ఇబ్రహీంపట్నం : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం బస్టాండ్ ఆవరణలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. దీంతో ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. కాగా, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. మృతుడు యాచకుడై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story