- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. CBDT చైర్మన్ పదవీ కాలం పొడిగింపు
ఐటీ శాఖ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ 'సీబీడీటీ'లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పాలనా వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ (Ravi Agarwal) పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. వాస్తవానికి ఇవాళ్టితో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉండగా.. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, రవి అగర్వాల్‌ను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 6 నెలల పాటు సీబీడీటీ చైర్మన్‌గా తిరిగి నియమించేందుకు గాను క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రవి అగర్వాల్ సీబీడీటీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
కాగా, 1988 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ జూన్ 2024లో మొదటిసారి సీబీడీటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన జూలై 2023 నుంచి సీబీడీటీ సభ్యుడిగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ విధులు నిర్వర్తించారు. ఆదాయపు పన్ను శాఖకు అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ అయిన సీబీడీటీలో ఓ చైర్మన్‌తో పాటు మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థిరంగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం రవి అగర్వాల్ పదవీ కాలాన్ని పొడిగించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.






