- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆరుగురు ప్రతివ్రతలు" మళ్లీ వస్తున్నారు
2004లో విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆరుగురు పతివ్రతలు సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: 2004లో విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆరుగురు ఆరుగురు ప్రతివ్రతలు సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రానికి ఈవీవీ దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా నిర్మించారు. సినిమాలో ఎల్.బి శ్రీరామ్, శ్రీకృష్ణ, కౌశిక్ ప్రధాన పాత్రలో నటించారు. ఆరుగురు కలిసి చదువుకున్న మహిళలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తరవాత వారి జీవితాల గురించి చర్చించుకోవడం.. వారి జీవితంలో జరిగిన ట్విస్టులను చూపించడమే సినిమా.
ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించగా ఇప్పటికీ టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా తరచూ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనం ఇస్తూ ఉంటాయి. సినిమాలోని వీడియో క్లిప్స్ సైతం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. దీంతో రీరిలీజ్ చేయాలి అంటూ చాలా కాలంగా కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు సినిమా రీరిలీజ్ అనౌన్స్ చేయడంతో అభిమానులు కుషీ అవుతున్నారు. అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కానీ విడుదల తేదీ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.






