- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాలోకేష్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు ఏపీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ తో కలిసి విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు ఏపీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ తో కలిసి విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వసతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యారంగం అభివృద్ధికి లోకేష్ చేస్తున్న కృషిని అభినందించారు. కాసేపు ౠయన పాఠశాల ప్రాంగణం అంతా తిరుగుతూ పరిశీలించారు. జాదు పిఠారా కిట్ ను పరిశీలించగా మంత్రి లోకేశ్, సిబ్బంది దాని ఉపయోగాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా విద్యార్థి మిత్ర కిట్ ను కేంద్రమంత్రికి చూపించారు. అందులో ఉన్న యూనిఫాం, స్కూల్ బుక్స్, బ్యాగ్, బూట్లు, పిక్టోరియల్ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తదితర వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో రూపొందించిన విలువల విద్య పుస్తకాలను గురించి లోకేష్ ధర్మేంద్ర ప్రధాన్ కు వివరించారు.






