- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్ల కరువు..!
by Batti.Sumithra |
మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

X
దిశ, రాయికోడ్ : మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా మూతపడిన రాయికోడ్ బస్టేషన్‌ను ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పునఃప్రారంభించారు. కానీ అక్కడ బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులకు మరుగుదొడ్లు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటికి తలుపులు సక్రమంగా లేవు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని రాయికోడ్ ప్రయాణ ప్రాంగణంలోని మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Next Story






