- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ..
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రద్దు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

దిశ, సికింద్రాబాద్ : కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రద్దు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని, అలాగే రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జార్జి రెడ్డి పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ 2023 కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫేక్ సర్టిఫికెట్లు, నకిలీ పత్రాల ఆధారంగా కొందరు రెగ్యులరైజ్ అయ్యారని, మొత్తం ప్రక్రియ పై సమగ్ర దర్యాప్తు చేపట్టి క్రమబద్ధీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని, 20 వేల ఖాళీలతో పోలీసు నియామకాలు, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వాతి, వేదాంత్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.






