- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది
గాంధారి మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు.

దిశ, గాంధారి : గాంధారి మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. రూ.1 కోటి వ్యయంతో పొతంగల్ ఖుర్ద్, నేరల్ తండా, పిస్కుల్ గుట్ట, చద్మల్, వండ్రికల్ గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ఆయగ్రామల సర్పంచ్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. దాదాపు కోటి పది లక్షల వ్యయంతో ఈ గ్రామపంచాయతీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా, రూ.10 లక్షల వ్యయంతో తిమ్మాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ట్లు వివరించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు సర్పంచ్ లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






