సత్తుపల్లిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

by Taduka Kalyani |

సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. చీపు పూర్ణచంద్రరావు తెలిపారు.

సత్తుపల్లిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. చీపు పూర్ణచంద్రరావు తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. అలాగే ఎస్టీ (కోయ, చెంచు, గోండు) విద్యార్థులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు యూనివర్సిటీ ఉచిత డిగ్రీ విద్యను అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఆగస్టు 7లోపు చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 94918 81910, 81878 37058 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Next Story