- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత కష్టపడి పని చేసినప్పుడు మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో తప్పు లేదు: ఐశ్వర్య రాజేష్
సినిమా కోసం అంతలా కష్టపడినప్పుడు మనకు మనం బహుమతులు ఇచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గత కొద్ది కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ భామ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ భారీ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఐశ్వర్య.. వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఓ సుకుమారితో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనన్నారు. అలాగే ‘ఇసాకపట్నం’ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ఓటీటీ ప్రియులను అలరించనున్నారు. అయితే ఈ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ జోరు పెంచిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
సినిమా కోసం అంతలా కష్టపడినప్పుడు మనకు మనం బహుమతులు ఇచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు. "నేను నటించే ప్రతి సినిమా పూర్తయ్యాక నాకు నేను ఒక గిఫ్ట్ కొనుక్కుంటాను. అంత కష్టపడి పని చేసినప్పుడు మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో తప్పు లేదు" అని ఐశ్వర్య స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తన లైఫ్‌లో కొనుక్కున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్ గురించి చెబుతూ.. "నా కెరీర్‌లోనే అత్యంత ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్ ఒక లగ్జరీ వాచ్. దాని ధర అక్షరాలా 15 లక్షల రూపాయలు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్ అయ్యాక.. ఆ చిత్రానికి వచ్చిన రెమ్యునరేషన్‌తో ప్రత్యేకంగా ఈ వాచ్ కొనుక్కున్నాను" అని వెల్లడించారు. ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక వాచ్ కోసం అంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్రాండెడ్ వాచ్‌లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.






