బెజ్జూర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ లేట్ ఫీజు వ్యవహారం పై ఏటీడీవో విచారణ

by Batti.Sumithra |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌ పై కాగజ్‌నగర్ ఏటీడీవో భాస్కర్ మంగళవారం విచారణ నిర్వహించారు.

బెజ్జూర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ లేట్ ఫీజు వ్యవహారం పై ఏటీడీవో విచారణ
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌ పై కాగజ్‌నగర్ ఏటీడీవో భాస్కర్ మంగళవారం విచారణ నిర్వహించారు. దిశ దినపత్రికలో ప్రచురితమైన "బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ లేట్ ఫీజు వసూళ్లు" అనే కథనానికి స్పందించిన ఏటీడీవో భాస్కర్, విద్యార్థులు ఆశ్రమ పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారనే కారణంతో వార్డెన్ శ్రీనివాస్ వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పై విచారణ చేపట్టారు. విద్యార్థుల నుంచి వార్డెన్ లేట్ ఫీజు వసూలు చేసినట్లు విద్యార్థులు వెల్లడించడంతో, వార్డెన్‌కు చార్జ్ మెమో జారీ చేసినట్లు తెలిపారు.

అలాగే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన లేట్ ఫీజు మొత్తాన్ని వార్డెన్ శ్రీనివాస్ తిరిగి విద్యార్థులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఏటీడీవో భాస్కర్ తెలిపారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మారుబాయి పాల్గొన్నారు.

Next Story