- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG POLYCET 2026: ఇంటర్నల్ స్లైడింగ్ ఫలితాల విడుదల.. రేపటి నుంచి ‘స్పాట్ అడ్మిషన్లు’
టీజీ పాలిసెట్-2026 ఇంటర్నల్ స్లైడింగ్ ఫలితాలు విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TGPOLYCET-2026) ఇంటర్నల్ స్లైడింగ్ ఫలితాలను విడుదల చేసింది. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ‘స్పాట్ అడ్మిషన్ల’ షెడ్యూల్‌ను కూడా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీ పాలిసెట్ అడ్మిషన్ల కన్వీనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ ప్రకటించారు.
అయితే, జూన్ 27 నుంచి జూన్ 28 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఇందులో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం 1,619 మంది అభ్యర్థులు మొత్తం 3,015 ఆప్షన్లను ఎంచుకున్నారు. ప్రక్రియ పూర్తి కావడంతో మొత్తం 1,229 మంది అభ్యర్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్ల మార్పు (Alotment) జరిగినట్లుగా వెల్లడించారు. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక కళాశాలల వారీగా, బ్రాంచ్‌ల వారీగా మిగిలిపోయిన ఖాళీల వివరాలను జూన్ 30న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు వ్యక్తిగతంగా సంబంధిత కళాశాలకు వెళ్లడం తప్పనిసరి. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఫీజు వివరాలు వెబ్‌సైట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.






