‘జెన్-Z’ టార్గెట్‌గా పవన్ కల్యాణ్ కొత్త సినిమా!

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-30 08:04:43  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

‘జెన్-Z’ టార్గెట్‌గా పవన్ కల్యాణ్ కొత్త సినిమా!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత యువత (Gen-Z) టేస్ట్‌కు తగ్గట్టుగా తన రాబోయే చిత్రాలు ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోయే సినిమా స్క్రిప్ట్‌లో కీలక మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.

జెన్-Z టార్గెట్‌గా..

ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా '#TheyCall HimOG-2' (ఓజీ-2) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత, సురేందర్ రెడ్డితో చేయబోయే ప్రాజెక్ట్ మరింత స్టైలిష్‌గా, నేటితరం యువతను (Gen-Z) అమితంగా ఆకట్టుకునే అంశాలతో ఉండాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. కథ పవర్‌ఫుల్‌గా ఉంటూనే, ప్రజెంట్‌ ట్రెండ్‌కు తగ్గట్టు ఉండాలని పవన్ కోరడంతో.. ఇప్పటికే స్క్రిప్ట్‌లో పలుమార్లు మార్పులు చేర్పులు (Story Revisions) జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సురేందర్ రెడ్డికి దొరికిన అదనపు సమయం..

మరోవైపు, పవన్ కల్యాణ్ లైనప్ '#OG2' (ఓజీ సీక్వెల్) కూడా త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఓజీ సీక్వెల్ పనులు వేగవంతం కావడంతో, ఈ గ్యాప్‌లో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి తన కథను మరింత పటిష్టంగా మార్చుకోవడానికి మంచి సమయం దొరికినట్లయింది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా, యువత థియేటర్లలో పూనకాలతో ఊగిపోయేలా ఒక పవరఫుల్ స్క్రిప్ట్‌ సిద్ధం చేసే పనిలో సురేందర్ రెడ్డి టీమ్ నిమగ్నమైంది. స్టైలిష్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సురేందర్ రెడ్డి, పవర్ స్టార్‌ను ఏ రేంజ్ చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

Next Story