Sanjay Raut: 'నా తల నరికినా.. పార్టీకి నమ్మకద్రోహం చేయను'

by Satheesh |   (  Updated:2022-06-27 12:56:10  IST  )

Won't Take Guwahati Route, Sanjay Raut Says After getting ED Notice| శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు పాత్రా చాల్ ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Wont Take Guwahati Route, Sanjay Raut Says After getting ED Notice
X

దిశ, వెబ్‌డెస్క్: Won't Take Guwahati Route, Sanjay Raut Says After getting ED Notice| శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు పాత్రా చాల్ ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభ నేపథ్యంలో శివసేన అగ్రనేతకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్రమంతా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. శివసేనను అణిచివేయడానికి ఇది బీజేపీ చేస్తోన్న కుట్ర అని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఓ పక్క ఎమ్మెల్యేల తిరుగుబాటుతో దెబ్బతిన్న శివసేన.. పార్టీ కీలక నేతకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో మరింత షాక్‌లో ఉంది. తాజాగా ఈడీ నోటీసులపై ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది తనను ఆపడానికి ఒక కుట్ర అని ఆరోపించారు. మీరు నా తల నరికినా, నేను గౌహతి మార్గంలో వెళ్లను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు తర్వాత అస్సోంలోని గౌహతికి వెళ్లిన విషయం తెలిసిందే. దీనితో వారిని ఉద్దేశించి సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారిలా పార్టీకి నమ్మకదోహ్రాం చేయనని అన్నారు.

Next Story