- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రహీరో సినిమాలో అశ్లీల సీన్లు.. మహిళా కమిషన్ అభ్యంతరం
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్ మూవీ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్ మూవీ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. యశ్ రేంజ్‌కు తగ్గట్లు హాలీవుడ్ రేంజ్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. టీజర్ స్టార్టింగ్‌లో అశ్లీల సీన్లు మితిమీరిపోయాయి. తాజాగా ఈ మూవీపై కన్నడలో వివాదం మొదలైంది. అశ్లీల సీన్లపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. వెంటనే టీజర్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఇంటిమేట్ సీన్లు మరీ బోల్డ్‌గా ఉన్నాయని లేఖలో పేర్కొంది.
కాగా, ‘కేజీఎఫ్’ చిత్రాల తర్వాత యశ్ నటిస్తోన్న సినిమా టాక్సిక్. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్ రాయ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఇప్పటికే విడుదల చేసిన వీరి ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి ఆదరణ లభించింది.
Read More..






