భార్యను చంపిన భర్త.. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

by S Gopi |

దిశ, పెద్డపల్లి: ఆర్ధికపరమైన గొడవలతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన..Woman stabbed to death by husband in Peddapalli

భార్యను చంపిన భర్త.. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, పెద్డపల్లి: ఆర్ధికపరమైన గొడవలతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27) అనే వివాహితను భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు గణేష్ ను గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. వీరికి 9 సంవత్సరాల కూతురు ఉందని తెలిపారు.

Next Story