భర్తతో గొడవపడి మహిళ అదృశ్యం

by Batti.Sumithra |

భర్తతో గొడవపడి చెరువుగట్టుకు వెళ్తున్నానని చెప్పి ఓ మహిళ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది.

భర్తతో గొడవపడి మహిళ అదృశ్యం
X

దిశ, నల్లగొండ క్రైం : భర్తతో గొడవపడి చెరువుగట్టుకు వెళ్తున్నానని చెప్పి ఓ మహిళ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం మార్తివారిగూడెం గ్రామానికి చెందిన మార్తి అనిత ఈ నెల 13న భర్తతో గొడవపడి నల్లగొండలోని సూర్యవంశీ కాలనీలో నివాసముంటున్న తన అన్న అశోక్ రెడ్డి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు చెరువుగట్టుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో, ఆమె తండ్రి మాలే పెద్దిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సీఐ 8712670141, ఎస్‌ఐ సైదులు 8712577228 లేదా 8712531330 నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

Next Story