దొంగతనానికి వచ్చిన వ్యక్తిపై మహిళ దాడి... తట్టుకోలేక పరుగోపరుగు(వీడియో)

by Dishanational1 |
దొంగతనానికి వచ్చిన వ్యక్తిపై మహిళ దాడి... తట్టుకోలేక పరుగోపరుగు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ దొంగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ధైర్యం చేసి అతడిని ప్రతిఘటించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... టర్కీష్ లో ఉన్న ఓ బేకరిలోకి ఓ వ్యక్తి నల్లటి దుస్తువులు ధరించి దొంగతనానికి వెళ్లాడు. ఆ బేకరీలో ఉన్న మహిళ అతడిని గమనించింది. అతను డ్రాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆ మహిళ అతడిని క్లాత్ మరియు క్లీనింగ్ స్ప్రేతో దాడి చేస్తుంది. దీంతో అతను తట్టుకోలేక ఆ దొంగ అక్కడి నుంచి పారిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆ మహిళను అభినందిస్తున్నారు.


Next Story

Most Viewed