- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలు విరిగిందని ఆసుపత్రికి వెళితే హార్ట్ సర్జరీ.. మహిళ మృతి
by Muthe.Rajitha |
హరియాణాలోని పానిపట్ లో ఓ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హరియాణాలోని పానిపట్ లో ఓ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది. పానిపట్ కు చెందిన గుడ్డుదేవి అనే మహిళ ఇటీవల కాలు జారి కింద పడటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో వేరే మహిళకు చేయాల్సిన గుండె ఆపరేషన్ ను గుడ్డుదేవికి చేసారు. అయితే సర్జరీ జరుగుతుండగానే గుడ్డుదేవి మరణించడంతో వైద్యులు పరిస్థితి దాటిపోయి మరణించిందని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే కాలు విరిగితే గుండెకు ఎందుకు ఆపరేషన్ చేసారని బంధువులు నిలదీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు.
Next Story






