- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెక్ డొనాల్డ్‌లో హల్చల్ చేసిన మహిళ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఆహారం లేదా వంటకాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో...Woman Climbs Through McDonald's Window To Make Her Own Food

దిశ, వెబ్ డెస్క్: ఆహారం లేదా వంటకాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కూడా మరో వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ మహిళ మెక్ డొనాల్డ్ కు వెళ్లి ఆర్డర్ చేస్తుంది. అయితే, అవుట్ లెట్ లో గ్లోవ్స్ అయిపోతున్నందున మెక్ డొనాల్డ్ సిబ్బంది ఆమె ఆర్డర్ ను తీసుకోవడానికి నిరాకరిస్తారు. వెంటనే ఆ మహిళ తానే తయారు చేసుకుని తింటానంటూ అక్కడే ఉన్న కిటికీ ద్వారా అందులోకి దూకుతుంది. 'మీతో కలిసి పని చేయడానికి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఇది ఒక శిక్షణ సమయం. ఇది నా మొదటి రోజు శిక్షణ మరియు నేను సరిగ్గా దుస్తువులు ధరించకుండా వచ్చాను. కాబట్టి మీరు బాధ్యత వహించాలి' అని మహిళ కోరుతుంది. అయితే, ఆ మహిళ తనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్ ను తయారు చేసుకుందా లేదా అనేది మాత్రం తెల్వలేదంటూ అందులో పేర్కొన్నారు.






