మటన్ తిన్నదని మహిళను హత్య చేసిన పక్కింటి వ్యక్తి..

by Vinod kumar |

దిశ, డిండి: మతిస్థిమితం లేని ఓ మహిళను హత్య - Woman brutally murdered in Nalgonda district

మటన్ తిన్నదని మహిళను హత్య చేసిన పక్కింటి వ్యక్తి..
X

దిశ, డిండి: మతిస్థిమితం లేని ఓ మహిళను హత్య చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి తర్వాత మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గజరాల్ తండాకు చెందిన రాట్లవత్ బుజ్జి(45) వివాహం అనంతరం భర్త చనిపోగా ఒంటరిగా తన తమ్ముడు శ్రీను ఇంట్లో ఉంటుంది. ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండక పోవడం తో పాటు టి.బి వ్యాధితో బాధపడటంతో ఎర్రగడ్డ హాస్పిటల్ లో కొద్ది రోజులు ఉండి, గత రెండు నెలల నుండి తండాలో భిక్షాటన చేస్తూ నివాసం ఉంటుంది.


ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న మూడవ శక్రు ఇంటికి వెళ్లి ఇబ్బంది కలిగించడంతో పాటు ఎంత చెప్పినా, బెదిరించినా మతిస్థిమితం సరిగా లేక వినక పోయేది. హోలీ పండుగ రోజు తాను తెచ్చుకున్న మటన్ ను.. లేని సమయంలో అన్నం మటన్ తిన్నదని అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో పదునైన గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు. మృతురాలి తమ్ముడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.

Next Story