మహిళ దారుణ హత్య.. సొంత అక్కను చంపిన తమ్ముడు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-18 06:58:43  IST  )

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) లో ఆస్తి వివాదంతో సొంత అక్క అంజమ్మను తమ్ముడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

మహిళ దారుణ హత్య.. సొంత అక్కను చంపిన తమ్ముడు
X

దిశ, సూర్యాపేట/వెబ్ డెస్క్: సొంత తమ్ముడి చేతిలో అక్క దారుణ హత్య (Brutal murder)కు గురికావడం తీవ్ర కలకలంగా మారింది. ఈ షాకింగ్ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సురుగి అంజమ్మ భర్త చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊర్లో) తన చెల్లెలు వద్ద ఉంటుంది. తన చెల్లి మంచి చెడు చూసుకోవడంతో తన పేర ఉన్న 2 ఎకరాల భూమిని చెల్లెలుకు ఇస్తా అనడంతో అక్క, తమ్ముడు మధ్య వివాదం ముదిరింది.

ఆస్తి తనకు ఇవ్వకుండా చెల్లెలుకు ఇస్తా ఉంటుండడంతో కోపం పెంచుకున్న తమ్ముడు.. అక్కను చంపితేనే ఆ ఆస్తి తనకు వస్తుందనే దురుద్దేశంతో హత్య ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో అంజమ్మ ఈ రోజు ఉదయం 6.45 కి కరువు పనికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. పదునైన కత్తితో పలుమార్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story