వింబుల్డన్ ఫైనల్.. సిన్నర్ vs జ్వెరోవ్

by Muthe.Rajitha |

టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది.

వింబుల్డన్ ఫైనల్.. సిన్నర్ vs జ్వెరోవ్
X

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. లండన్ వేదికగా సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు తలపడనున్నారు. ఆదివారం లండన్ సెంటర్ కోర్టులో జరిగే ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌గా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇటలీ స్టార్ జానిక్ సినర్ సెమీ-ఫైనల్‌లో క్లినికల్ ప్రదర్శనతో అదరగొట్టాడు. టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను స్ట్రెయిట్ సెట్లలో 6-4, 6-4, 6-4 తేడాతో మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మరోవైపు టోర్నీలో 3వ సీడ్‌గా ఉన్న జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సెమీస్‌లో స్థానిక బ్రిటన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లేయర్ ఆర్థర్ ఫెరీని స్ట్రెయిట్ సెట్లలో ఓడించాడు. తన కెరీర్‌లో వింబుల్డన్ ఫైనల్‌కు చేరడం జ్వెరెవ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

వరుసగా రెండో వింబుల్డన్ టైటిల్‌ను ముద్దాడాలని సినర్ పట్టుదలతో ఉండగా.. తన కెరీర్‌లో మొట్టమొదటి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని జ్వెరెవ్ భావిస్తున్నాడు. ప్రపంచ నంబర్ 1 సినర్ యొక్క బేస్‌లైన్ పవర్ గేమ్‌ను, జ్వెరెవ్ తన పవర్‌ఫుల్ సర్వీస్‌లతో ఎలా అడ్డుకుంటాడనేది రేపటి మ్యాచ్‌లో తేలనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను వీక్షించడానికి పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకుటుంబీకులు వింబుల్డన్ రాయల్ బాక్స్‌కు తరలిరానున్నారు.

Next Story