- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC మరో నోటిఫికేషన్
by Muthe.Rajitha |
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. ఇవి మల్టీ జోనల్ క్యాడర్‌లో ఉన్నాయి. స్టేట్ లెవెల్ క్యాడర్‌లో 2, మల్టీ జోనల్‌లో 5 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 10 నుంచి మొదలు కాగా.. ఆగస్టు 17 వరకు చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు. జీతం స్కేల్ రూ. 58,850 నుంచి రూ.1,37,050 వరకు ఉంటుంది. విద్యార్హతలు బీ.ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 44 లోపు వారు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Next Story






