పవన్ డైరెక్టర్‌కి వరుణ్ ఛాన్స్ ఇస్తాడా..?

by Dishafeatures2 |
పవన్ డైరెక్టర్‌కి వరుణ్ ఛాన్స్ ఇస్తాడా..?
X

దిశ, వెబ్‌వెస్క్: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ అందుకుంటున్నాడు. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'గని, ఎఫ్3' మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఎప్పుడో వరుణ్ ఓకే చేసిన సినిమా ఇప్పుడు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ డైరెక్టర్ వరుణ్ అవకాశం ఇస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడెవరో కాదు సాగర్ కే చంద్ర. అవును. వరుణ్, సాగర్ కాంబోలో మూవీ ఎప్పుడో ఓకే అయింది. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. 2012లో 'అయ్యారే' సినిమాతో సాగర్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'అప్పట్లో ఒకడుంటేవాడు' అనే స్పోర్ట్స్ డ్రామాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత వరుణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ ఈ సినిమాకు భారీ బడ్జెట్ కానుందని, అప్పట్లో ఇద్దరికీ ఫేమ్ అంతగా లేకపోవడంతో ఎవరూ ముందకు రాలేదని, అందుకే ఈ మూవీ అటకెక్కిందని టాక్ ఉంది. అయితే తాజాగా 'భీమ్లా నాయక్' సినిమాతో సాగర్ భారీ ఫేమ్ అందుకున్నాడు. అదే విధంగా వరుణ్ తేజ్‌ కూడా తనదైన స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. మరి వీరి కాంబో మూవీ ఇప్పుడేమైనా పట్టాలెక్కుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీపై వరుణ్, సాగర్ ఏ ప్లాన్ చేస్తారో చూడాలి.



Next Story

Most Viewed