- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలు పోతేనే స్పందిస్తారా....? పెచ్చులుడుతున్న ధన్వాడ ఎస్సి హాస్టల్
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రత్యేక చొరవ చూయించి ధన్వాడ ఎస్సి హాస్టల్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

దిశ, ధన్వాడ : నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రత్యేక చొరవ చూయించి ధన్వాడ ఎస్సి హాస్టల్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఎమ్మెల్యే రూ 3.22 కోట్లను మంజూరు చేయించి నూతన భవన నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇప్పించారు దీంతో ఎమ్మెల్యే చేసిన మంచి పనికి పార్టీలకతీతంగా కృతజ్ఞతలు తెలిపారు అంతా బాగున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంజూరైన నిధులతో భవన నిర్మాణాలు చేపట్టడానికి ఆలస్యమే అవుతుంది టెండర్ల ప్రక్రియ తోపాటుగా నిర్మాణం పూర్తి కావాలంటే దాదాపుగా ఏడాది నుంచి రెండేండ్లు పట్టే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రస్తుతం హాస్టల్ ఉంటున్న విద్యార్థుల పరిస్థితి గురించి ఎవరు ఆలోచించడం లేదు
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో శిథిలావస్థ భవనంలోని హాస్టల్ నిర్వాణ కొనసాగుతుంది జిల్లాలోని అనేక మండలాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి ధన్వాడ ఎస్సీ హాస్టల్ లో జైన్ కావడం జరిగింది ప్రస్తుతం 150 మంది విద్యార్థులు శిథిలవస్థకు చేరుకున్న భవనంలోనే నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా శిథిలావస్థకు చేరుకున్న భవనంలో ఉండటంతో ఎప్పుడు పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పోతాయోనని విద్యార్థులు భయం భయం తో కాలం వెళ్ళదిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ఉంచుకొస్తుందని విద్యార్థులు భయపడిపోతున్నారు పై పెచ్చులు ఊడిపోతున్నాయి ఎవరిపై పడి ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థుల ఆందోళనను అధికారులు ఎవరూ గుర్తించడం లేదు. ప్రాణాలు పోతే తప్ప అధికారులు స్పందించరా..? అని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదివించే స్తోమత లేని ఎంతోమంది నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ఇక్కడి హాస్టల్ లో చేర్చి చదివిస్తున్నారు.
పైకప్పు నుంచి ఊడి పడుతున్న పెచ్చులు ..
ఎన్నో ఏండ్ల భవనం అది.... వందల మంది విద్యార్థులు నివాసముంటున్న భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్ ప్రస్తుత కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఈ శిథిలావస్థ భవనం చూసి అవక్కయ్యారు ఇలాంటి భవనంలో విద్యార్థులు ఎలా ఉంటున్నారని జిల్లా కలెక్టర్ లే విస్మయం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఇబ్బందిని గుర్తించి కలెక్టర్ ప్రియాంక తక్షణమే ఇకనుంచి హాస్టల్ ను తాత్కాలిక భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఈ ఆదేశం ఇప్పటిది కాదు వేసవి సెలవులో ఇచ్చిన ఆదేశం కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు మళ్లీ విద్యా సంవత్సరం ప్రారంభమైంది విద్యార్థులు సైతం ఈ శిథిలావస్థ భవనంలోనే నివాసం ఉంటున్నారు శిథిలావస్థ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతింది దీనివల్ల పై పెచ్చులు ఎప్పుడు ఊడి పడతాయో తెలియని పరిస్థితి దాపురించింది. మొన్నటికి మొన్న ఎంపీ డీకే అరుణ సైతం హాస్టల్ ను సందర్శించి పై కప్పులు పరిశీలించారు. పైకప్పు నుంచి ఎప్పుడు పెచ్చులు కింద పడతాయో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే హాస్టల్లో తాత్కాలిక భవనంలోకి మార్చాలని ఎంపీ సైతం సూచించారు అయినా మార్పు రాలేదు విద్యార్థులు భయంతో గడుపుతున్నారు రాత్రి సమయంలో అయితే ఇక చెప్పరానిది. ఈ విషయంలో అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు
ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారు ..
ధన్వాడ ఎస్సి హాస్టల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నూతన భవనం కోసం నిధులు మంజూరు చేశారు రూ 3.22 కోట్లు మంజూరయ్యాయి అయితే పనులు ప్రారంభం కావడం... భవన నిర్మాణం పనులు పూర్తికావడం సమయం పడుతుంది. అప్పటివరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు తెలియజేశాం
ఒగ్గు రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధన్వాడ
పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి ..
ధన్వాడ ఎస్సి హాస్టల్ భవనం శిథిలవస్థకు చేరుకుంది. పైకప్పు పూర్తిగా దెబ్బతింది. పైకప్పు చూస్తే పెచ్చులుడిపోయిన దృశ్యాలే ఉన్నాయి. నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం చాలా సంతోషం. కానీ నిర్మాణం పనులు పూర్తయ్య వరకు విద్యార్థుల పరిస్థితి ఏంది
ఇర్ఫాన్ అహ్మద్, ధన్వాడ
అధికారులు మొద్దు నిద్ర వీడాలి ..
హాస్టల్ భవనం చూస్తేనే భయమేస్తుంది. మరి విద్యార్థులు ఎలా ఉంటారు. శిథిలావస్థకు చేరుకున్న భవనం పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఉడిపడ్డ పెచ్చుపై కప్పును చూస్తే క్షణం కూడా విద్యార్థులను అక్కడ ఉంచలేరు
గుర్రం రాజు, బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి






