- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

దిశ, రాయికోడ్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆందోల్ నియోజక వర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సిరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలని సూచించారు.ప్రతి ఒక్క ఓటర్లకు మండల ప్రజాప్రతినిధులు సూచనాలు ఇవ్వాలని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ఉండకుండా BLA లు బూతుల వారీగా రోజు వారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఓటర్లతో సమన్వయం చేసుకొని ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.పూర్తి అయినా ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేందుకు బూత్ లేవల్ అధికారుల బిఎల్వోలకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డా..రాజీవ్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య,జగన్ మోహన్ రెడ్డి,సతీష్, సుధాకర్ రెడ్డి,రాంరెడ్డి, కేదార్నాథ్ పాటిల్,సిద్దన్న పాటిల్,బసరాజ్ పాటిల్,మహంకాళీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నర్సింలు, మండల ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ ,యువకులు తదితరులు పాల్గొన్నారు.






