మన ధర్మమే మన దేశానికి రక్ష.. ఎంపీ ఈటెల రాజేందర్

by Taduka Kalyani |

లక్షల సంఖ్యలో సాదులుసంతులు ఈ దేశమే నా కుటుంబమని, నా పుట్టుకే మానవ కళ్యాణం కోసమని పనిచేస్తున్నారు కాబట్టే ఈకలియుగంలో కలికాలంలో ఈమాత్రమన్నా ప్రశాంతత ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.

మన ధర్మమే మన దేశానికి రక్ష.. ఎంపీ ఈటెల రాజేందర్
X

దిశ, చైతన్యపురి : లక్షల సంఖ్యలో సాదులుసంతులు ఈ దేశమే నా కుటుంబమని, నా పుట్టుకే మానవ కళ్యాణం కోసమని పనిచేస్తున్నారు కాబట్టే ఈకలియుగంలో కలికాలంలో ఈమాత్రమన్నా ప్రశాంతత ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీనగర్ లోని సువర్ణ భారతి గోశాలలో ఏర్పాటు చేసిన భారత్ నేషనలిస్ట్ ఫోరం మూడవ వార్షికోత్సవ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భిన్న వైవిధ్యాలు ఉన్నా సుభిక్షంగా సురక్షితంగా కొనసాగుతున్న భారతదేశం మానవ కళ్యాణాన్ని కోరుకుంటుంది. అందుకే సర్వేజన సుఖినోభవంతు అనే నానుడి వచ్చిందన్నారు. మనతో సమానంగా ఉన్న చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అనేక గల్ఫ్ దేశాలలో రాజరికమే తప్ప ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏ సంస్కృతి ఉన్నా కలిసిమెలిసి జీవించే అవకాశాన్ని కల్పించింది భారతదేశం మాత్రమేనని తెలిపారు. ప్రపంచానికి సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని అందించింది కాబట్టి భారతదేశం విశ్వగురు అయిందని అమెరికాకు ఇంత పెద్ద చరిత్ర లేదన్నారు. ఇంత సంప్రదాయం ఉన్నా మన దేశంలో కనకూడని వినకూడని సమస్యలు వింటున్నప్పుడు మన ప్రాణం కొట్టుకుంటుందని ఆవేదన వ్యక్తం చేసారు.

సమాజమంటే సంపద ఒకటే కాదు మానసిక ప్రశాంతత ఉన్న దేశమే అత్యంత సంపన్నమైన దేశమని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబం మన దేశంలోనే చూస్తున్నాం. పాత్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్న యువతకు మన విలువలు నేర్పించకపోతే దేశంలో ప్రశాంతత ఉండదన్నారు. దేశాన్ని రక్షించే సత్తా ప్రభుత్వాలకు మాత్రమే ఉండదని అది మన ధర్మానికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు పసర్లపాటి శ్రీనివాస బంగారయ్యశర్మ, హజీబు శ్రీనివాసరావు, చౌడవరపు కరుణాకర్, కుండకూల యాదయ్య, బీఎన్ఎఫ్ అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి వంశీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం సనాతన ధర్మానికి సంబంధించిన పలు పుస్తకాలను అయన ఆవిష్కరించారు.

Next Story