వైద్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి

by Taduka Kalyani |

వైద్య సేవల్లో నాణ్యతకు, మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.

వైద్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి
X

దిశ, శంషాబాద్: వైద్య సేవల్లో నాణ్యతకు, మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. శంషాబాద్‌లో ఆదివారం మెడ్‌ఔరా స్పెషాలిటీ అండ్ వెల్‌నెస్ క్లినిక్ ను ఆయన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్లినిక్‌ను స్థాపించిన డాక్టర్ ఎం. హనుమంత రెడ్డి, డాక్టర్ మేతిని రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొనమల దేవేందర్, రాజేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లారెడ్డి, జనార్ధన్, అమరేందర్ రెడ్డి, రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story