సదాశివపేటలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద.. ప్రజల్లో ఆందోళన

by Taduka Kalyani |   (  Updated:2026-07-12 14:14:23  IST  )

సదాశివపేట పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

సదాశివపేటలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద.. ప్రజల్లో ఆందోళన
X

దిశ, సదాశివపేట: సదాశివపేట పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారులు, కాలనీలు, బస్టాండ్ పరిసరాలు, పాఠశాలల సమీపంలో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలన్నా, మహిళలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం బయటకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో వీధి కుక్కలు ద్విచక్ర వాహనాలను వెంబడించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కల దాడుల్లో ప్రజలు గాయపడిన ఘటనలు జరిగినప్పటికీ, సమస్యను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల ప్రాణ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు అంటున్నారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడం, రేబిస్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్య మరింత తీవ్రమయ్యే లోపు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజలకు భద్రత కల్పించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story