శివరాజ్ కుమార్ ‘బెయిల్’ రిలీజ్ వాయిదా.. పవర్ ఫుల్ పోస్టర్‌తో కొత్త డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |

విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

శివరాజ్ కుమార్ ‘బెయిల్’ రిలీజ్ వాయిదా.. పవర్ ఫుల్ పోస్టర్‌తో కొత్త డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ నిమ్మ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘బెయిల్’. ఈ చిత్రాన్ని గోవిందాయమనహ, గూగ్లీ, రణవిక్రమ, నటసార్వభౌమ రైమో వంటి విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన పవన్ ఒడయార్ తెరకెక్కిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడినట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

దసరా పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ‘బెయిల్’ టీమ్ అక్టోబర్ రేస్‌లోకి రావడం విశేషం. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు దర్శకుడు పవన్ ఒడయార్ స్పష్టం చేశారు. అలాగే నేడు శివరాజ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ‘హ్యాపీ బర్త్ డే డేర్ డెవిల్’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ సరికొత్త పవర్‌ఫుల్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో శివరాజ్ కుమార్ లుక్ ఎంతో మాస్‌గా, గంభీరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. యాక్షన్ ఎపిసోడ్స్, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగనుందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. శివరాజ్ కుమార్ నటన, పవన్ ఒడయార్ టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్.

Next Story