- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి పేరుతో యువతిని మోసం.. కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు రెండు సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించి, ఆర్థికంగా కూడా దోపిడీ చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, ఖైరతాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు రెండు సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించి, ఆర్థికంగా కూడా దోపిడీ చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, చైతన్యపురికి చెందిన రూపావత్ శంకర్‌కు ఓ ఆందోళన కార్యక్రమంలో బాధిత యువతితో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి 2024 డిసెంబర్‌లో తన ఇంటికి పిలిచి శారీరక సంబంధం పెట్టుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గర్భం దాల్చగా బలవంతంగా గర్భస్రావం చేయించాడని, ఆ తర్వాత కూడా పెళ్లి చేస్తానని నమ్మించి మరోసారి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2025 ఏప్రిల్‌లో రెండోసారి గర్భం దాల్చిన బాధితురాలిని స్కానింగ్ పేరుతో ఆస్పత్రికి తీసుకెళ్లి మరోసారి గర్భస్రావం చేయించాడని, ఈ సమయంలో పలుమార్లు తన వద్ద నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం వివాహం చేసుకోవాలని కోరగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపింది. ఆస్పత్రి నుంచి కోలుకున్న తర్వాత కూడా నిందితుడు వివాహానికి నిరాకరించడంతో బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






