- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవల్లిలో సీసీ రోడ్డుకు క్యూరింగ్ చేయలేదంటూ ఆరోపణలు
రేవల్లి నూతన తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డుకు క్యూరింగ్ (నీరు పట్టడం) చేయకపోవడంతో నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దిశ, రేవల్లి : రేవల్లి నూతన తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డుకు క్యూరింగ్ (నీరు పట్టడం) చేయకపోవడంతో నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సరైన పర్యవేక్షణ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, మట్టి రహదారి స్థానంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. గతవారం రెడీమిక్స్ కాంక్రీటుతో పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం తప్పనిసరిగా చేపట్టాల్సిన క్యూరింగ్‌ను కాంట్రాక్టర్ నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. క్యూరింగ్ చేసినట్లు కనిపించేలా రోడ్డుపై వరి గడ్డి పరచి వదిలేశారని, సరైన విధంగా నీరు పట్టకపోతే కాంక్రీటు బలం తగ్గి భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తక్కువ స్థాయి మెటీరియల్ వినియోగించారనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు సాంకేతిక విచారణ జరిపి, నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించి, లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఏఈ భార్గవ్ రెడ్డిని వివరణ కోరగా, కాంట్రాక్టర్ క్యూరింగ్ చేయడం లేదని ఫిర్యాదులు అందాయని, వెంటనే క్యూరింగ్ చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.






