- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతికి లేని వివక్ష.. మనుషుల కెందుకు: ట్రెక్కర్ అన్వితా రెడ్డి ప్రశ్న
హైదరాబాద్‌లో గిరిజ పైడిమర్రికి 'ఎమ్మా గేట్ ఉడ్' అవార్డు ప్రదానం.. 'గిరిగమనం' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎవరెస్ట్ ట్రెక్కర్ అన్వితా రెడ్డి!

దిశ, తెలంగాణ బ్యూరో: పర్వతారోహణకు వెళ్ళినప్పుడు, వాటిలో తనను తాను చూసుకున్నానని గుర్తు చేసుకుంటూ,ప్రకృతికి లేని వివక్ష మనుషులకెందుకని ట్రెక్కర్ అన్వితా రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ కు చెందిన ట్రెక్కర్, ట్రావెలర్ గిరిజ పైడిమర్రికి 'గ్రాండ్మా ఎమ్మా గేట్ ఉడ్ ' అవార్డును ఎవరెస్ట్ పర్వతారోహకురాలు పడమట అన్వితా రెడ్డి ద్వారా ప్రదానం చేశారు. సుజన పొడపాటి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ అవార్డు ప్రదానోత్సవ సభ వెన్నెల గీత సామాజిక సాహిత్య అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో అన్వితా రెడ్డి మాట్లాడుతూ, 15వ ఏట భువనగిరి గుట్ట ఎక్కడంతో తన పర్వతారోహణ మొదలైందని, ఆ గుట్టనే తన అడ్రస్ అని అన్నారు. గిరిజ పైడి మర్రి త ట్రెక్కింగ్, పర్యటన అనుభవాలతో రచించిన ‘గిరిగమనం’ పుస్తకాన్ని అన్వితా రెడ్డి ఆవిష్కరించారు. వెన్నెల గీత సాహిత్య సామాజిక వేదిక లక్ష్యాలను, ఎమ్మా గేట్ ఉడ్ ట్రెక్కింగ్ జీవిత విశేషాలను ప్రముఖ రచయిత్రి డాక్టర్ గీతాంజలి వివరించారు.
గిరిజ పైడిమర్రి రాసిన 'గిరిగమనం' పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ కాకర్ల సమీక్షిస్తూ, గిరిజ టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఈ పుస్తకం సాగుతుందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోందని, కొండలను కాపాడుకోవాలని పిలుపు నిచ్ఛా రు. 'ట్రెక్కింగ్ లో మహిళలు' అన్న అంశంపై ట్రెక్కర్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాఘవ ప్రసంగిస్తూ, క్రీడా స్పూర్తి లాగానే ట్రెక్కింగ్ స్పూర్తి ఉంటుందని, ట్రెక్కింగ్ లో కులం, మతం, హోదా వంటి సామాజిక వికారాలు ఏ మాత్రం తొంగిచూడవని, జెండర్ సమానత్వం కూడా ఉంటుందని అన్నారు. ట్రెక్కింగ్ లో మహిళలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, నేటి యువత ఎమ్మా గేట్ ఉడ్ స్పూర్తి తో గిరిజ పైడి మర్రిని, అన్వితారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు. సభకు అనేకమంది రచయితలు, వేణుగోపాల్ , రమణాచారి , రాజశేఖర్ తదితర సీనియర్ పాత్రికేయులు హాజరయ్యారు.






