- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 SSC బ్యాచ్
కాలం పరుగులు తీసింది.. జీవితాలు మారాయి.. కానీ 50 ఏళ్ల క్రితం పాఠశాల గదుల్లో చిగురించిన స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు.

దిశ,సంగారెడ్డి అర్బన్: కాలం పరుగులు తీసింది.. జీవితాలు మారాయి.. కానీ 50 ఏళ్ల క్రితం పాఠశాల గదుల్లో చిగురించిన స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 SSC బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం మల్కాపూర్ శివారులో అపూర్వంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన పదో తరగతి సహచరులతో కలిసి హాజరై బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న నేస్తాలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించు కున్నారు. ఆనాటి పాఠశాల రోజులు, గురువుల మందలింపులు, కలిసి పంచుకున్న నవ్వులను గుర్తుచేసుకున్నారు. తమకు అక్షరాలు నేర్పిన గురువులు కూడా హాజరుకావడంతో పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. 50 ఏళ్ల నాటి మిత్రులను ఒక్కతాటిపైకి తెచ్చిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను బ్యాచ్‌మేట్లుఅభినందించారు. వచ్చిన మిత్రులందరినీ ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఏమన్నారంటే..
చాలా ఏళ్ల తర్వాత నా పదో తరగతి స్నేహితులందరినీ ఒకే చోట చూడటం మాటల్లో చెప్పలేని ఆనందం. చిన్నతనంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ వయసులో కూడా మనమంతా సంతోషంగా కలుసుకోవడం మన అదృష్టం అన్నారు.2009లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. చెప్పుకోలేని అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ ప్రజల ప్రేమ, అండదండలే నన్ను నిలబెట్టాయని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడకుండా జీవించాను. నా వల్ల ఎవరికీ నష్టం జరగకూడదు.. ఎవరికీ కష్టం కలగకూడదనే ఆలోచనతో పనిచేశాను. ఈ రోజు మీ అందరి ముందు తలెత్తుకుని నిలబడేలా దేవుడు అవకాశం ఇచ్చాడని అన్నారు.మీలో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా నా పరిధిలో ఉంటే తప్పకుండా అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, ఎం. వెంకటేశం, జనార్దన్, మనోహర్, కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, సుధీర్ రెడ్డి, చిక్కుల మల్లేశం, రామప్ప, శ్రీధర్ రెడ్డి, చక్రపాణి, విఠల్, పెద్దగొల్ల ఆంజనేయులు, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






