'సర్' ను సద్వినియోగం చేసుకోవాలి

by Taduka Kalyani |

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ ఎన్నికల నమోదు అధికారి (ERO), జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నార్సింగి సర్కిల్ మణికొండ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సోమవారం సందర్శించారు.

సర్ ను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, గండిపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ ఎన్నికల నమోదు అధికారి (ERO), జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నార్సింగి సర్కిల్ మణికొండ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), సూపర్వైజర్లతో సమావేశమై ఇంటింటికీ వెళ్లి ఈఎఫ్ (ఎన్యూమరేషన్ ఫారం)లను సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఫారాల డిజిటలైజేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడి, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, ఫారాల సమర్పణ అవసరం, ఓటరు వివరాల నవీకరణ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో సహాయ ఎన్నికల నమోదు అధికారి నార్సింగ్ డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story