అద్దంకి దయాకర్ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు: గోసుల శ్రీనివాస్

by Malleboina Mahesh |

అద్దంకి దయాకర్ సీఎం మెప్పుకోసమే హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో మండిపడ్డారు.

అద్దంకి దయాకర్ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు: గోసుల శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం మెప్పుకోసమే అద్దంకి దయాకర్ హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన అద్దంకి దయాకర్ కాదని, అబద్ధాల దయాకర్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అద్దంకి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థాయిని మరిచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు. లేదంటే బీఆర్ఎస్ నాయకులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story