కృష్ణ కిరాణాపై ఎక్సైజ్ శాఖ దాడులు

by Ratna Kumari |

నాటు సారా (గుడుంబా) తయారీలో వినియోగించే నల్ల బెల్లం, పట్టిక (అలమ్), చక్కెరను స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూర్ ఎక్సైజ్ సీఐ బుసా అశోక్ తెలిపారు.

కృష్ణ కిరాణాపై ఎక్సైజ్ శాఖ దాడులు
X

దిశ, పెద్దవంగర : నాటు సారా (గుడుంబా) తయారీలో వినియోగించే నల్ల బెల్లం, పట్టిక (అలమ్), చక్కెరను స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూర్ ఎక్సైజ్ సీఐ బుసా అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవంగర మండల కేంద్రంలోని **కృష్ణ కిరాణా** దుకాణంలో నల్ల బెల్లం అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎక్సైజ్ ఎస్సై శంకర్ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సోదాల్లో దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 325 కిలోల నల్ల బెల్లం, 200 కిలోల పట్టిక (అలమ్), 200 కిలోల చక్కెరను ఎక్సైజ్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని కిరాణా దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బుసా అశోక్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై శంకర్‌తో పాటు సిబ్బంది రవీందర్, సంపత్, శశివర్ధన్ పాల్గొన్నారు.

Next Story