బీసీల అభ్యున్నతే లక్ష్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Kodari Anjali |

బీసీ కులస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే అన్నారు.

బీసీల అభ్యున్నతే లక్ష్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్: బీసీ కులస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని బీసీ సంక్షేమ భవనంలో బీసీ సమీకృత కార్యాలయ పరిధిలో భవనాలు లేని 13 బీసీ కుల సంఘాలకు భవనాల కేటాయింపు, మిగతా సంఘాలకు స్థలాల కేటాయింపునకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి ఎమ్మెల్యే లక్కీ డ్రా తీశారు. బీసీ సంఘాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలు అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

Next Story