- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌల్ట్రీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాలి: బండారు దత్తాత్రేయ
పశుసంవర్థక, పౌల్ట్రీ రంగాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పశుసంవర్థక, పౌల్ట్రీ రంగాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ-నాగ్‌పూర్, పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల వెట్ కన్వర్జెన్స్–2026 వైస్ ఛాన్స్‌లర్ల సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సులో దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించాలని, పరిశోధన ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చూడాలని సూచించారు.
ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వెటర్నరీ పరిశోధనలు, స్టార్టప్‌ల ప్రోత్సాహం, అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్, పశుసంవర్థకంలో ఏఐ వినియోగం వంటి ఆరు అంశాలపై సదస్సులో మేధోమథనం జరిగింది. దేశవ్యాప్తంగా 30 మందికి పైగా వైస్ ఛాన్స్‌లర్లు, శాస్త్రవేత్తలు, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఉదయ్ సింగ్ బయాస్, ఎం. శ్రీకాంత్, పీవీఎన్‌ఆర్టీవీయూ వీసీ ప్రొఫెసర్ ఎం.జ్ఞాన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 25–27 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. నవంబర్ 24న పౌల్ట్రీ నాలెడ్జ్ డే నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






