- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువత ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువత ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్‌లోని మారుతీనగర్‌లో ఎల్‌కే ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఐరన్ డిస్ట్రిక్ట్ శక్తి–దృఢత్వ శిక్షణ కేంద్రం"ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరమన్నారు.
ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫిట్‌నెస్ కేంద్రాలు యువతకు మెరుగైన వ్యాయామ వాతావరణాన్ని కల్పించడమే కాకుండా ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వ్యాయామ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని, జిమ్ నిర్వాహకులు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు నిఖిల్ భరత్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చిన్న యాదవ్, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, గౌస్, ఇమ్రాన్, తులసి సురేష్, పిట్టల శ్రీనివాస్, విజయ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మణిరత్నం, జంగరాజు, ఉపేందర్, శ్రీకాంత్, వైశాలి, కవిత, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.






