- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EV Components: ఈవీ విడిభాగాలకు భారీ డిమాండ్
అంతకుముందు ఏడాది భారత్‌కు సుమారు 500 మిలియన్ డాలర్ల(రూ. 4,750 కోట్ల) మేర ట్రేడ్ సర్‌ప్లస్ ఉండటం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆటో విడిభాగాల పరిశ్రమ మూడేళ్ల తర్వాత మళ్లీ వాణిజ్య లోటు నమోదు చేసింది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆటో విడిభాగాల దిగుమతులు 13 శాతం పెరిగి 25.4 బిలియన్ డాలర్ల(రూ. 2.42 లక్షల కోట్ల)కు చేరగా, ఎగుమతులు 5 శాతం వృద్ధితో 24 బిలియన్ డాలర్ల(రూ. 2.28 లక్షల కోట్ల)కే పరిమితమయ్యాయి. దీంతో 1.4 బిలియన్ డాలర్ల(రూ. 13.34 వేల కోట్ల) ట్రేడ్ డెఫిసిట్ నమోదైంది. అంతకుముందు ఏడాది భారత్‌కు సుమారు 500 మిలియన్ డాలర్ల(రూ. 4,750 కోట్ల) మేర ట్రేడ్ సర్‌ప్లస్ ఉండటం గమనార్హం. మొత్తం దిగుమతుల్లో 36 శాతం వాటాతో చైనా అగ్రస్థానంలో నిలవగా, జపాన్, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), అధునాతన ఎలక్ట్రానిక్ విడిభాగాల డిమాండ్ పెరగడం వల్లే దిగుమతులు గణనీయంగా పెరిగాయని ఏసీఎంఏ తెలిపింది.
అయితే, దిగుమతులు పెరిగినా పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉందని ఏసీఎంఏ తెలిపింది. కొనసాగుతోంది. 2025–26లో ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవర్ 12.7 శాతం పెరిగి రూ.7.60 లక్షల కోట్లకు చేరింది. వాహన తయారీ సంస్థలకు సరఫరాలు 16.3 శాతం, ఆఫ్టర్‌మార్కెట్ 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో స్థానిక తయారీ (లోకలైజేషన్) ఇంకా పరిమితంగా ఉండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా తెలిపారు. భవిష్యత్తులో స్థానిక తయారీ, సాంకేతిక సామర్థ్యాల పెంపు, గ్లోబల్ విలువ గొలుసులో మరింత ముందుకు వెళ్లడం ద్వారా ఈ లోటును తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.






