- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపైనే కారు దగ్ధం.. క్షణాల్లో వ్యాపించిన మంటలు
by Kodari Anjali |
రోడ్డుపైనే కారు దగ్ధం అయిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజనీ తండాలో జరిగింది.

X
దిశ, కుబీర్: సొంత వాహనంలో ప్రయాణం సురక్షం అనుకుంటాం. కానీ ఒక్కోసారి సాంకేతిక కారణాలతో క్షణాల్లో మంటలు వ్యాపించి కాలి బూడిదైతున్నాయి. అలాంటి సంఘటన ఆదివారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజనీ తండాలో రోడ్డుపైనే ప్రయాణిస్తున్న కారులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి బయట పడ్డారు. జాంగం గ్రామానికి చెందిన పండరి AP25 N6262 కారులో పని నిమిత్తం రంజనీ తండాకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కారులో నుంచి దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితుడు వెంటనే అప్రమత్తమై దిగాడు. క్షణల్లోనే మంటలు వ్యాపించి కారు కాలిపోయిందని స్థానికులు తెలిపారు.
Next Story






