- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది
ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలి కొన్నది. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో ఈరోజు సాయంత్రం చోటుచేసుకుంది.

దిశ, సంగారెడ్డి : ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలి కొన్నది. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో ఈరోజు సాయంత్రం చోటుచేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం... ఝరాసంగం మండలం కురుసంఘం గ్రామానికి చెందిన గొల్ల ప్రశాంత్ (19), జోగిపేట ప్రాంతానికి చెందిన సతీష్ (17) అతని మరో ముగ్గురు స్నేహితులు ఐదుగురు కలిసి మల్కాపూర్ చెరువు వద్దకు వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్నేహితులంతా కలిసి ఈత కొడదామని చెరువులోకి దిగారు. ఈత సరిగ్గా రాకపోవడంతో సతీష్, ప్రశాంత్ లు నీట మునిగి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కాగా మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కాలేజీలో బి.జెడ్.సి రెండో సంవత్సరంలో చదువుకుంటున్నారు.






