- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుమరాలితో కారు నడిపించిన ఎస్‌ఐపై కేసు నమోదు
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, గండిపేట: చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 11 సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్-ఇన్స్పెక్టర్ పూజారి తిరుపతి తన అరున్నర సంవత్సరాల మనుమరాలిని TS07 GP 7450 నంబర్ గల కారులో డ్రైవింగ్ సీటులో కూర్చోబెట్టి హైదర్ షాకోట్ డివిజన్ పరిధిలోని గంధంగూడ–బైరాగిగూడ రోడ్డుపై వాహనం నడిపించారు. ఈ వ్యవహారంపై అప్పుడే స్థానికులు అడ్డుకొని డ్రైవింగ్ పక్క సీట్లో ఉన్న ఎస్ఐ నిలదీశారు. తన తాత ఎస్సై అని సదరు బాలిక తెలిపింది. అదేవిధంగా ఎస్ఐ కూడా దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్థానికులు ఈ దృశ్యాలను వీడియోలు తీయడంతో బాగా వైరల్ అయ్యాయి. విషయం నార్సింగి పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనకు సంబంధించి ఆదివారం విచారణ చేపట్టారు. మైనర్‌తో వాహనం నడిపించినందుకు ఎస్ఐ పూజారి తిరుపతిపై క్రైమ్ నం. 1313/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 125తో పాటు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184, 180 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలియజేశారు..






