నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు

by Kodari Anjali |

నకిలీ పత్తి విత్తనాల అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం చింతలమాన పెళ్లి ఎస్ఐ కమలాకర్ తెలిపారు.

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, బెజ్జూర్: నకిలీ పత్తి విత్తనాల అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం చింతలమాన పెళ్లి ఎస్ఐ కమలాకర్ తెలిపారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గూడెం గ్రామంలో పత్తి విత్తనాలు సమాచారం మేరకు, ఏఈఓ జ్ఞానేశ్వర్‌తో సహా కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించగా, డేగ సంతోష్, డోకే తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రలోని చింతవారి వెంకటేష్ అనే వ్యక్తి వద్ద నుండి ఐదు కిలోల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి చింతలమాన పెళ్లి మండలంలో వివిధ గ్రామాల రైతులకు అసలు విత్తనాలనీ, నమ్మించి అధిక ధరలకు ధరలకు విక్రయిస్తున్నారని, ద్విచక్ర వాహనంతో తీసుకువస్తుండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నకిలీ విత్తనాలు గ్లైకోసిట్ అమ్ముతే సమాచారం అందించాలని తెలిపారు.

Next Story